నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘భగవంత్ కేసరి’. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఓ రేంజ్లో హిట్ అవ్వడంతో భగవంత్ కేసరి మేనియా మొదలైంది.
ఇది వైజాగ్లో వేరే లెవెల్లో ఉంది. వైజాగ్లో మొత్తం సింగిల్ స్క్రీన్లలో 40కి పైగా షోస్ ఉంటే అన్ని షోస్ కూడా భగవంత్ కేసరికి హౌస్ ఫుల్స్ పడిపోయాయి. దీంతో విశాఖలో బాలయ్య ఫ్యాన్స్ మేనియా ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఇప్పటికే వరుసగా రెండు హిట్లు కొట్టిన బాలయ్య భగవంత్ కేసరితో హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.