టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు భారీగా షాకిచ్చారు. గోపాలపురం టికెట్ విషయంలో టీడీపీ శ్రేణులు అసంతృప్తిలో ఉన్నారు. గోపాలపురం టికెట్‌ను మద్దిపాటి వెంకటరాజుకు కేటాయించడాన్ని మాజీ జెడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ప్రచారానికి వచ్చిన చంద్రబాబు కాన్వాయ్‌ను బాపిరాజు వర్గీయులు అడ్డుకొని ఆందోళన చేశారు.