అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి.. రమేష్ రెడ్డితో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో త్వరలో రమేష్ రెడ్డి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.