విదేశీ విద్యార్థులు చదువు పూర్తయినా అక్కడే ఉం టూ ఉద్యోగం వెతుక్కోవడానికి వీలుకల్పించే ఆప్షనల్ ప్రాక్టీ స్ ట్రైనింగ్(ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ బిల్లును సైతం ప్రవేశపెట్టారు.
తమ దేశంలో ఉన్నత విద్య అభ్యసించే విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్ తగలనుంది.
ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన విద్యార్థులు చదువు పూర్తికాగాన స్వదేశాలకు వెళ్లాల్సిందేనని ఆ దేశానికి చెందిన చట్టసభ సభ్యులు కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు అమెరికా చట్టాల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు.
విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టీ స్ ట్రైనింగ్(ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ బిల్లును సైతం ప్రవేశపెట్టారు.
ఇది చట్టంగా మారితే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువు పూర్తికాగానే స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
ఇదే గనుక జరిగితే ఓపీటీ ఆధారంగా అమెరికాలో ఉంటున్న 80 వేల మంది భారతీయ విద్యార్థులకు కూడా ఇబ్బందులు తప్పేలా లేదు.
ఓపీటీని తొలగించడం కోసం ‘ఫెయిర్‌నెస్ ఫర్ హై-స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్’ పేరుతో ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఓపీటీ వల్ల అమెరికాకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
విదేశీ విద్యార్థులు తక్కువ వేతనాలకే పనిచేస్తుండటంతో అమెరికాలోని వ్యాపార సంస్థలు వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నాయని, దీంతో స్థానిక విద్యార్థులు నష్టపోతున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే బిల్లును ప్రవేశపెట్టింది విపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడంతో ఈ బిల్లు సెనేట్ ఆమోదం పొందడం అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.