కర్ణాటక హుబ్బళ్లి ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె నేహా(24) బీవీబీ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీలో ఫయాజ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఫయాజ్‌ను నిరంజన్ మందలించారు. దీంతో కోపం పెంచుకున్న అతడు గురువారం పరీక్షలు రాసి బయటకు వచ్చిన నేహపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రగాయాలతో నేహ ప్రాణాలు విడిచింది.