Blue pit viper : నీలి రంగులో పాము.. వైరల్
పాములు అంటేనే ఏ బూడిద రంగులోనూ మరికొన్ని తెలుపు రంగులోనూ ఉంటాయన్న సంగతి తెలిసిందే.
కానీ వీటికి భిన్నంగా నీటి రంగులో మెరిసిపోయే పాము వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘బ్లూ పిట్ వైపర్’గా పిలిచే ఇది ఏంచక్కా చెట్ల కొమ్మలు, పూల చెట్లపై ఉంటూ కనిపించిన చిన్న కీటకాలను గుటుక్కుమంటాయి.
విషపూరితమైన బ్లూ పిట్ వైపర్ వీడియోను ‘లైఫ్ ఆన్ ఎర్త్’ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేయగా ఇప్పటికే 50 వేలకుపైగా లైక్స్ రావడం గమనార్హం.
ఈ పాములు ఇండోనేసియా, తూర్పు తైమూర్ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయని మాస్కో జూ అధికారులు వెల్లడించారు.