Homeహైదరాబాద్latest NewsBREAKING: క‌ళ్ల‌లో కారం కొట్టి .. టీడీపీ నేత దారుణ హ‌త్య‌..!

BREAKING: క‌ళ్ల‌లో కారం కొట్టి .. టీడీపీ నేత దారుణ హ‌త్య‌..!

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టిడిపి మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలో టిడిపి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. టిడిపి మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్ళినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళల్లో కారం కొట్టి అతనిని చంపేశారు. ఈ సంఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.

Recent

- Advertisment -spot_img