సంధ్య థియేటర్ కేసులో అరెస్టు అయిన అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు చంచల్‌గూడ జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.