జనసేనపై నిహారిక మాజీ భర్త జోన్నలగడ్డ చైతన్య సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆయన పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారనే ఈ వార్త సారాంశం. జనసేన పార్టీకి ఎవరూ ఓటు వేయకండి. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతారు. జనసేన సిద్ధాంతాలు పవన్ కల్యాణ్ కూడా పాటించడు. ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పోలిక ఉండదు.
చాలా మంది సెలబ్రిటీలు పవన్ కల్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. కానీ వారంతా పవన్ కల్యాణ్ అంటే భయం తోనే ప్రచారం చేస్తున్నారు. ఆర్టిస్టులను పవన్ భయపెట్టడంతోనే ప్రచారానికి వస్తున్నారు. జనసేనను నమ్మి ఎంతో మంది మోసపోయారు.. పోతున్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు చెప్పినట్లు వింటున్నాడని జోన్నలగడ్డ చైతన్య కామెంట్ చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.