- ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధి హామీ
- ఈ ఏడాది పనులు ప్రారంభం అయ్యే అవకాశం
- ఐదు మండలాల ప్రజలకు సాగు, తాగునీరు సౌకర్యం
ఇదే నిజం, భూపాల్ పల్లి ప్రతినిధి: దశాబ్ద కాలంగా ఎలాంటి పనులకు నోచుకుని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. 2010లో ప్రారంభమైన ఈ పనులు కొద్దినెలలు మాత్రమే నడిచిన అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారములోకి రాగానే చిన్న కాళేశ్వరం పనులు నిలిచిపోయాయి. దీంతో కాటారం, మహదేవపూర్, మహా ముత్తారం , మలహర్, పలిమెల మండలాల ప్రజలకు తాగు, సాగునీరు సౌకర్యానికి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మాదాపూర్, మహా ముత్తారం, మలహర్ మండలాల ప్రజల కోసం రూ. 526 కోట్లతో చేపట్టిన ఈ పనులు కేవలం పైపులైన్ పనులకు మాత్రమే పరిమితమై పోగా ఇంకా 50శాతం పనులు పూర్తి కావాల్సింది. ఈ పనులు పూర్తయితే ఈ మండలాల్లోని ప్రజలకు రెండు పంటలు పండడమే కాక వాణిజ్య పంటలైన అయినా పత్తి, మిర్చి పంటలు పండిరచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఎంతో కృషితో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించగా పది సంవత్సరాలు అధికారంలో లేకపోవడంతో ఆ పనులను చేపట్టే నాథుడు కరువైయ్యారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను రాగానే పనులు చేపడతారని శ్రీధర్ బాబు ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడమే తన కలని ఆయన ఎన్నో సందర్భాల్లో ప్రజలకు తేలియజేశారు. వచ్చే మార్చి నుంచి చిన్న కాళేశ్వరం పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా నీటి సౌకర్యం కలుగుతుంది. అంతేగాక కొన్ని గ్రామాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ నీటి సరఫరా జరగలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ పనులు సైతం పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చిన్న కాలేశ్వరం పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలలో ఆనందాలు వ్యక్తమై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని సుమారు 45 చెరువులకు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గారేపెల్లి గ్రామ కేంద్రంలో చెరువు పనులు త్వరలో ప్రారంభం కానున్నయని తెలిసింది.