– సోషల్ మీడియాలో పోస్ట్
– యువకుడి అరెస్ట్
ఇదే నిజం, బెల్లంపల్లి: బర్త్‌డే వేడుకల్లో తల్వార్‌తో కేక్ కట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తీలో దాసరి అజయ్ అనే యువకుడు గత ఏడాది డిసెంబర్ 29న పుట్టినరోజు సందర్భంగా తల్వార్, మారణాయుధాలతో కేక్ కట్ చేశాడు. తర్వాత ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు దాసరి అజయ్‌ని అరెస్ట్ చేసి .. అతడి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రెండ్రోజుల క్రితం పోస్ట్ ఆఫీస్ బస్తీ ఏరియాలో హరికృష్ణ అనే యువకుడు సైతం జన్మదినం సందర్భంగా చేతిలో తల్వార్ పట్టుకొని కేక్ కట్ చేశాడు. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.