తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల (నవంబర్) 6 నుంచి సమగ్ర కులగణన సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టామని, దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం త్వరలోనే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.