Jagan bail cancel petition : ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ పిటిషన్లపై ఈరోజు తీర్పును వెలువరిస్తామని గత విచారణ సందర్భంగా ప్రకటించిన కోర్టు… తుది తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామని తెలిపింది.
జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరి పిటిషన్లపై తీర్పును ఒకే రోజున వెలువరిస్తామని చెప్పింది.
ఈ పిటిషన్లను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై గత నెలాఖరులో వాదనలు ముగిశాయి. సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
సీఎం స్థాయిలో ఉన్న జగన్ తనకున్న అధికారాన్ని ఉపయోగించి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని తన పిటిషన్ లో రఘురాజు పేర్కొన్నారు.
బెయిల్ రద్దు చేసి, విచారణను త్వరగా ముగించాలని కోర్టును ఆయన కోరారు.
వివిధ కారణాలను చెపుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని చెప్పారు.