Central government alert on Omicron : ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్రం హెచ్చరిక
దేశంలో కరోనా కేసులు (Corona Cases) తగ్గుముఖం పడుతున్నాయి అనే క్రమంలో..
కొత్త వేరియంట్ గుబులు రేపుతోంది. తాజాగా ప్రస్తుతం దక్షిణాప్రికాలో కరోనా కొత్త వేరియంట్ గుర్తింపుతో ప్రపంచ దేశాలన్ని అలర్ట్ అయ్యాయి.
ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది.
ఇది అత్యంత ఆందోళనకరమైన వేరియంట్ గా వర్గీకరించింది.
దీనిపై ప్రపంచదేశాలు జాగ్రతగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది.
దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రస్తుతం దేశ వ్యా ప్తంగా అమలులో ఉన్న కొవిడ్ నిబంధనలు (Covid Rules), మార్గదర్శకాల్ని డిసెంబర్ 31వరకు పొడిగించింది.
ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాం తాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది.
ఒమిక్రాన్ వేరియంట్ పట్ల రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అత్యం త అప్రమత్తతో ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించింది.
విదేశీ ప్రయాణికులపై దృష్టి..
ఒమిక్రాన్ వ్యాప్తి పెరగకుండా ఉండేదకు ఈ నెల 25న కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధికారులను ఆదేశించారు.
భారత దేశానికి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనిం గ్, టెస్టింగ్ చేయాలని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్ నిబంధనలను డిసెంబర్ 31 వరకు పొడగించాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు.
వాక్సినేషన్‌లో మార్పులకు అవకాశం..
కొవిడ్ వ్యాక్సిన్ల (Vaccination)కు సంబంధించి భారత్ లో ప్రస్తుతం రెండు డోసుల విధానమే అమలులో ఉంది.
బూస్టర్ డోసుగా భావించే మూడో డోసుపై ఇంకా విధానపరమైన నిర్ణయం వెలువడలేదు.
అయితే, ఒమిక్రాన్ వేరియంట్ సుడిగాలిలా ప్రపంచమంతటా వ్యాపిస్తోన్న నేపథ్యంలో మూడో డోసు పంపిణీపై భారత్ సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది.
డిసెంబర్ రెండో వారంలోపే దేశంలో బూస్టర్ డోసు పంపిణీపై కేంద్రం ఒక విధానాన్ని ప్రకటించబోతున్నదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మూడో డోసు పంపిణీని మొదలు పెడితే, ముందుగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఇవ్వాలా? లేక ఆరోగ్యవంతులకే అందజేయాలా? రెండో డోసు తీసుకున్న ఎన్ని రోజుల వ్యవధిలో బూస్టర్ డోసుగా మూడో టీకాను ఇవ్వాలి? తదితర అంశాలపై పూర్తి స్థాయి క్లారిటీతో కేంద్రం వ్యాక్సినేషన్లపై కొత్త విధానాన్ని డిసెంబర్ రెండో వారంలోపే ప్రకటించనుంది.
నిజానికి మన దేశంలో ఇవాళ్టికి 123 కోట్ల డోసులు పంపిణీ అయినప్పటికీ, రెండో డోసు తీసుకోడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు.
దీంతో వ్యాక్సిన్ నిల్వలు పేరుకుపోతున్నాయి. సోమవారం నాటికి 25 కోట్ల డోసుల స్టాక్ ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.
వ్యాక్సిన్లు వృధా కాకుండా బూస్టర్ డోసులుగా వాటిని అందిస్తే మంచిదని నిపుణులు ముందునుంచే చెబుతున్నారు.
సుమారు 75 దేశాల్లో బూస్టర్ డోసు విదానం అమలవుతున్నది.
ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ కేంద్రం ఒమిక్రాన్ పై చర్చ చేపట్టనుంది.
బుధవారమే ఒమిక్రాన్ పై ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశాలున్నాయి.