ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా చిత్తూరులో పర్యటించారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు స్పీచ్‌కు రిప్లై ఇస్తూ ఫుల్ జోష్‌గా కనిపించారు.
“ఇది నా జిల్లా. నేను పుట్టిన జిల్లా. చివరి మీటింగ్ ఇక్కడి నుంచే పెట్టాలనుకున్నా. రాష్ట్రానికి ఇక్కడినుంచే మార్గనిర్దేశనం చేయాలి. రాజకీయ ఓనమాలు నేర్పించిన జిల్లా. మీ గౌరవాన్ని కాపాడటానికి అనునిత్యం పనిచేశా. నన్ను అరెస్టు చేసిన నంద్యాలలోనే చివరి మీటింగ్ పెట్టా. అరెస్టు చేసినప్పుడు ప్రశ్నిస్తే మేం చెప్పం అని అధికారులు అన్నారు. నాలాంంటి వ్యక్తినే ఇలా అన్నారంటే సామాన్యుని పరిస్థితి ఏంటి. ఈ సైకో పోవాలి. ప్రభుత్వాన్ని కూలదోయాలి. సామాన్యుడిగా, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేశా. ఈ జిల్లా అభివృద్ధి కోసం సీరియస్ గా పనిచేశా.
టీసీఎల్, జోహో, అపోలో నాలెడ్జ్ సిటీ నేనిచ్చిందే. నేను పెట్టిందే. అవినీతికి ప్రతిరూపం సైకోప్రభుత్వం. అవునా కాదా? ఈరోజు ఈ రోడ్లొచ్చాయి. దేశంలో ఫోర్ లేన్, సిక్స్ లేన్ రోడ్లొచ్చాయంటే తెలుగుదేశం పార్టీ చేసిన పనే. ముప్పై ఏళ్లు టెక్నాలజీ గురించి పని చేశాను. అందువల్లే ప్రతీ ఒక్కరూ సెల్‌ఫోన్ వాడుతున్నారు. భర్త, భార్య లేకపోయినా..ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అవునా కాదా? పేదవాళ్లు ఫోన్ వాడుతున్నారా లేదా?
సాగునీటికోసం కష్టపడిని వ్యక్తి NTR. తెలుగుగంగ, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు తెచ్చారు. నేనొచ్చాక 65 వేల కోట్లు ఖర్చు పెట్టా. ఈ ప్రభుత్వం అయిదేళ్లలో తట్టమట్టి తీయలేదు. మోసగాడిని ఇంటికి పంపిస్తారా లేదా? చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చూస్తా. రాయలసీమ ద్రోహి జగన్. నేను కూడా రాయలసీమ బిడ్డనే. ఈ గడ్డ మీదే పుట్టా. తమ్ముళ్లూ ఒక్క ఛాన్స్ అన్నాడు. నెత్తిమీద చెయ్యి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు. కరిగిపోయి 151 సీట్లు ఇస్తిరి. 22 ఏళ్లు మా ప్రభుత్వం ఉంది.
ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. పదవులన్నీ ఆయనకే. ఎమ్మెల్యే, మంత్రి, పదవులు, కాంట్రాక్టులన్నీ ఆయనకు చెందినవారికే. వీళ్ల అబ్బ సొమ్మా? మక్కిలిరగ్గొడ్తాం. పేదల కోసం ఖర్చు పెడ్తాం. ఎర్ర చందనం స్మగ్లర్లకు సీట్లిచ్చి జగన్ రెచ్చగొడుతున్నాడు. ఏం తమ్ముళ్లూ..అవునా కాదా? బెదిరిస్తే భయపడ్తారా మీరు. మామూలు గాలి కాదు తమ్ముళ్లూ ఇది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చూశాం. ఈ రోజు ప్రజల్లో చైతన్యం కనిపిస్తోంది. మీలో కసి, బాధ, ఆవేశం కనిపిస్తోంది. 40 రోజుల్లో జరిగిన 89 సభల్లో ఎక్కడ చూసినా ఇదే ఊపు.
నేనెప్పుడైనా నేరాలు చేశానా తమ్ముళ్లూ? అవినీతికి పాల్పడ్డానా? మీకు బాగా తెలుసు నా గురించి. ఈ సైకో జగన్‌ను, నేరస్థులను వదిలిపెట్టబోను.
అమరరాజా ఫ్యాక్టరీ ఇక్కడినుంచి వెళ్లిపోయిందా లేదా? నీ భారతి సిమెంట్ ను నేను మూయించలేనా. సాక్షి పేపర్ చూశారా తమ్ముళ్లూ. అన్నీ అబద్దాలే. మీ జీవితాల్లో అంధకారం తెచ్చే వ్యక్తి ఈ సైకో. మెటల్ క్వారీని కొట్టేసాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. కేజీఎఫ్ మాదిరిగా ఇష్టానుసారంగా లూటీ చేశాడు. పదివేలు కాదు, తులం బంగారం ఇచ్చినా గెల్వలేడు.
దీని అర్థం ఏంటి? మీ భూమి మీది కాదు. తప్పు చేసి ఓటేస్తే ఆ భూములు జగన్ సొంతమవుతాయి. హైకోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది తమ్ముళ్లూ. రాజముద్రను ఆమోదిస్తారా..సైకో ఫోటోను ఆమోదిస్తారా..మీకు కోపం రాలేదా…గట్టిగా చెప్పండి. ఏం చేద్దాం దీన్ని. చివరి సారి, చివరి మీటింగ్‌లో చించేసి చెత్తబుట్లలో పారేస్తున్నా. నేనొచ్చాక రాజముద్రతో పట్టా పాసుపుస్తకాలు ఇస్తాను. నేనొచ్చాక రెండో సంతకం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపైనే చేస్తా.
అందరం ఈ భూహక్కు కాపాడుకోవాలంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకావాలి. మీ మెడకు ఉరేసాడు జగన్. ఫ్యాన్ కు ఉరేస్తారా లేదా?…చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో వేస్తారా లేదా? తమ్ముళ్లూ. దెయ్యంలా వెంటబడుతున్నాడు. దెయ్యాన్ని వదిలించుకోవాలా లేదా?. గర్వం, ధీమాతో, మనం ఏమీ చేయలేమని ఈ సైకో ఇష్టారీతిన వ్మవహరిస్తున్నాడు. ప్రజాగళం, ఎన్నికల మ్యానిఫెస్టోను నేను, నా మిత్రుడు కలిసి తయారు చేశాం. సూపర్ సిక్స్, ప్రజాగళం, మోదీ హామీలు ఉంటాయి. అభివృద్దికి మార్గం చూపింది నేనా కాదా?. హైదరాబాద్‌లో సాధించామా లేదా?. 2024- 29 విజన్ తయారుచేశా. 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ కూడా రెడీగా ఉంది.
అమరావతి రాజధానిగా ఉంటుంది. మూడు రాజధానులు లేవు. రెండోది పోలవరం కూడా పూర్తి చేస్తాం. అమిత్ షాతో మాట్లాడాను. దొంగల్ని పట్టుకుంటాం. అవినీతిని నిర్మూలిస్తాం. నదులు అనుసంధానం చేసి నీళ్లి స్తాం.మూడోది. పరిశ్రమలు తీసుకొస్తాం. హైదరాబాద్, బెంగళూరు, విదేశాల నుంచి ఓటేయడానికి వస్తున్నారు తమ్మయుళలూ. నన్ను జైల్లో పెడితే 50 దేశాల నుంచి ప్రజలు స్పందించారు. అమెరికా నుంచి 4, 5 లక్షల ఖర్చు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ల ఆలోచన ఒక్కటే. జన్మభూమిని కాపాడుకోవాలి. జగన్ మళ్లీ వస్తే ఈ రాష్ట్రానికి పుట్టగతులు ఉండవని అనుకుంటున్నారు.
నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18 వేల రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తాం. తల్లికి వందనం. పిల్లలను చదివించడానికి ఒక్కొక్కరికి రూ. 15000 చొప్పున ఇస్తాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. అసెంబ్లీలో , పార్లమెంటులో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తాం. జాబు రావాలంటే మా కూటమి రావాలి. అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. నేను రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే. వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహిస్తాం. చిత్తూరులో ఐటీ టవర్ నిర్మిస్తాం. యువతకు స్కిల్స్ ఇప్పిస్తా.
చిత్తూరులో యూనివర్సిటీ కావాలన్నారు. యూనివర్సిటీయే కాదు, కాలేజీలు కూడా తెస్తా. విద్యాకేంద్రంగా చేస్తా. నేను కూడా చిత్తూరు ఎమ్మెల్యేనే. 2019 లో నామాట నమ్మలేదు మీరు. చివరికి మీరే అర్థం చేసుకున్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. 45 ఏళ్లుగా ఎవరికీ ఇవ్వనీ గౌరవం నాకు ఇచ్చారు. 30 ఏళ్లు పార్టీని రన్ చేశా. వర్షం కూడా పడుతోంది. వరుణ దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. శుభారంభం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నంబర్ 1, 2 గా ఉండాలని నా కోరిక.
నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా. సైకిల్ గుర్తు ఉంటే సైకిల్‌కు, కమలం గుర్తు కనబడితే కమలానికి ఈ రెండూ లేని చోట జనసేన గుర్తు గాజు గ్లాసుకు ఓటేయండి. మైనార్టీలకు అన్నీ చేసింది నేనే. ఉర్దూ యూనివర్సిలీ, రంజాన్ తోఫా వంటివి ఇచ్చింది నేనే. సీఏఏ, ఎన్నార్సీని వైసీపీ సపోర్ట్ చేసింది. 4 శాతం రిజర్వేషన్లు కాపాడతానని హామీ ఇస్తున్నా. అండగా ఉంటా. ఆశీర్వదించమని కోరుతూ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్. జై తెలుగుదేశం. జై జనసేన. ఓకే బై”.
– నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మాజీ సీఎం