Homeహైదరాబాద్latest Newsచవక.. చవక.. 100 రూపాయలకే కిలో చేపలు …ఎక్కడో తెలుసా ?

చవక.. చవక.. 100 రూపాయలకే కిలో చేపలు …ఎక్కడో తెలుసా ?

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటకు చెందిన ఒక వ్యక్తి చేపల చెరువు సాగు చేస్తున్నాడు. 100 రూపాయలకే కిలో చేపలు అని చాటింపు వేయించాడు.. చేపలు మంచి ఏపుగా పెరగడంతో తాజాగా అమ్మకం స్టార్ట్ చేశాడు. చేపల పులుసు, ఫ్రై తింటే బాగుంటుంది అనుకున్న నాన్ వెజ్ ప్రియులకు చెరువు వద్దకు పోటెత్తారు. జనం భారీగా పెరగడంతో జనం తోపులాట ఆగలేదు. క్యూలైన్ భారీగా ఉండటంతో.. కొనేందుకు వచ్చిన వారు గంటల తరబడి ఎండలో నిల్చోని ఇబ్బందులు పడ్డారు. స్థానికులు ‘చెరువు ఉన్న ఊరు గ్రామస్థులకే మొదట చేపలు ఇవ్వాలని’ డిమాండ్ చేశారు. పోలీసుల సాయంతో ఎట్టకేలకు చేపల చెరువు యజమాని విక్రయాలు ముగించాడు

Recent

- Advertisment -spot_img