Homeహైదరాబాద్latest Newsభవనం పైనుంచి పడి చిన్నారి మృతి

భవనం పైనుంచి పడి చిన్నారి మృతి

హైదరాబాద్ శివారు కీసరలో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ పైనుంచి పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. పోలీసులు కథనం ప్రకారం.. కీసర మండలం నాగారం తూర్పుగాంధీనగర్‌లో ఆర్‌.సాయికుమార్‌, కనకదుర్గ దంపతులు కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. వారి మూడేళ్ల కూతురు భవ్య ఈనెల 28న సాయంత్రం భవనం మొదటి అంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడింది. చిన్నారి తలకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరిలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Recent

- Advertisment -spot_img