– ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ
ఇదే నిజం, ఏపీ బ్యూరో: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించాలంటూ గురువారం ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ మళ్లీ మెమో దాఖలు చేసింది. నేటితో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తు్న్నందున ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది.
మరోవైపు ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బుధవారం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీఐడీ తరఫు వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. నిన్నటి వాదనలకు కొనసాగింపుగా ప్రస్తుతం అదనపు ఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తున్నారు.
Read More:
చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించాలి
http://idenijam.com/another-setback-for-chandrababu-in-the-kaushal-scam-case/