తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. రైతు రుణమాఫీలో భాగంగా దాదాపుగా ఇప్పటికే 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18 వేల కోట్లు జమయ్యాయి. రైతుల ఖాతాల్లో మరో త్వరలో 13 వేల కోట్లు జమ చేయనున్నారు. అయితే రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి డబ్బులు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు టాక్. దీని కోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.