Homeహైదరాబాద్latest Newsహీరో అల్లు అర్జున్‌కు సీఎం చంద్ర‌బాబు ఫోన్‌..!

హీరో అల్లు అర్జున్‌కు సీఎం చంద్ర‌బాబు ఫోన్‌..!

‘పుష్ప 2’ సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లిపోయారు. దీంతో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటులు ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్ర‌బాబు ఫోన్‌ చేసారు. అల్లు అర్జున్‌కు ఫోన్‌ చేసి సీఎం చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు.

Recent

- Advertisment -spot_img