– అవసరమైతే మా సహకారం
– అభివృద్ధికి మేం సహకరిస్తాం
– హైదరాబాద్ ఎంపీ అసద్దీన్ ఒవైసీ
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేండ్లు ఉంటారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అందుకు అవసరమైతే తమ సపోర్ట్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పాతబస్తీలో పర్యటించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రేవంత్‌రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి.. వాటిని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి.’ అంటూ అసద్ సూచించారు.