Homeతెలంగాణcommunist leaders: కామ్రేడ్స్ రివర్స్

communist leaders: కామ్రేడ్స్ రివర్స్

  • బీఆర్ఎస్ కు దూరం
  • ఉప ఎన్నికల్లో సపోర్ట్
  • అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తుంటుందని ప్రచారం
  • కానీ తాజాగా అసహనంగా కమ్యూనిస్టు నేతలు
  • జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతు..

communist leaders: ఇదే నిజం, స్టేట్ బ్యూరో: ఇంతకాలం బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిన కమ్యూనిస్టు నేతలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమవుతున్నట్టు కనిపిస్తోంది. చాలా రోజులుగా బీఆర్ఎస్, కమ్యూనిస్టు నేతల మధ్య అవగాహన కొనసాగుతున్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఉభయ కమ్యూనిస్టు నేతలు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. తమ వల్లే మునుగోడులో బీఆర్ఎస్ గెలిచిందని చెప్పుకున్నారు. మరోవైపు సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా వీరి ఫ్రెండ్ షిప్ క్ బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది.

అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్..
నల్లగొండ, ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లను తమకు కేటాయించాలని కమ్యూనిస్టు నేతలు బీఆర్ఎస్ ముందు ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. అయితే అందుకు సీఎం కేసీఆర్ ససేమిరా ఒప్పుకోలేదని తెలుస్తోంది. కమ్యూనిస్టులకు అవసరమైతే ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తాము కానీ.. సీట్లను వదులుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు టాక్. దీంతో కమ్యూనిస్టులు నిరాశ చెందారు. చాలా రోజులుగా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నా వారికి నిరాశే ఎదరైంది.

జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో..
జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు నేతలు క్రమంగా బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వాళ్లు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్టు టాక్. మరి కమ్యూనిస్టు నేతలు సపోర్ట్ చేయకపోతే బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని టాక్. మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img