తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 5,093 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక్కరోజులో కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
అదే సమయంలో 1,555 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,12,563 మంది కోలుకున్నారు.
మృతుల సంఖ్య 1,824గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 37,037 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
వారిలో 24,156 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 743 మందికి కరోనా సోకింది.