Dalitha Bandhu : త్వరలోనే దళితబంధు నిధులు
Dalitha Bandhu : దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.
ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నారు.
ఆస్తమా లేక ఉబ్బసం ఎందుకొస్తుంది.. రాకుండా ఏం చేయాలి..
మీ తాత గుండు ఫట్.. ఈ ఆట ఆడిన మొక్క ఉపయోగాలు తెలుసా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం ద్వారా వందశాతం సబ్సిడీ కింద అందించే రూ.10లక్షలు..
దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారి,
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహదపడుతుందని సీఎం స్పష్టం చేశారు.
మీ శరీరానికి ఎన్ని ప్రోటీన్లు కావాలో లెక్కగట్టండి ఇలా..
దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళితబంధును ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామని వివరించారు.