Homeసైన్స్​ & టెక్నాలజీDangerous Mobile Apps : మీ మొబైల్​లో ఈ యాప్స్​ ఉన్నాయా..

Dangerous Mobile Apps : మీ మొబైల్​లో ఈ యాప్స్​ ఉన్నాయా..

Dangerous Mobile Apps : మీ మొబైల్​లో ఈ యాప్స్​ ఉన్నాయా..

Dangerous Mobile Apps : మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారా? కొత్త కొత్త యాప్‌లు ట్రై చేయ‌డం మీకు అల‌వాటా? అయితే జాగ్ర‌త్త !!

ఈ 8 యాప్‌లు మీ మొబైల్‌లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి.

మొబైల్‌ రేడియేషన్ తగ్గించ‌డం ఎలానో తెలుసుకోండి ఇలా..

కొత్త‌ర‌కం మాల్ వేర్ క‌లిగి ఉన్న 8 యాప్‌ల జాబితాను తాజాగా మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ విడుద‌ల చేసింది.

ఫొటో ఎడిట‌ర్‌, వాల్ పేప‌ర్స్‌, ప‌జిల్స్, కీబోర్డ్ స్కిన్స్ అలాగే కెమెరా యాప్‌ల పేరుతో ఇవి యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయ‌ని మెకాఫీ సంస్థ త‌న రిపోర్ట్‌లో తెలిపింది.

ఆగ్నేయాసియా, అరేబియ‌న్ పెనిసులా ప్రాంతానికి చెందిన యూజ‌ర్లే ఈ యాప్‌ల‌ ప్ర‌ధాన టార్గెట్‌గా గుర్తించింది.

ఈ యాప్‌లకు ఇప్ప‌టికే 7 ల‌క్ష‌ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని పేర్కొంది.

కడుపులో మొబైల్‌ ఫోన్‌

ఈ 8 యాప్‌లు మీ మొబైల్‌లో ఉంటే వెంట‌నే డిలీట్ చేయాల‌ని సూచించింది.

ఒక యాప్‌ను గూగుల్ ప‌రిశీలించి, ఎలాంటి హానిక‌ర మాల్‌వేర్స్ లేవ‌ని నిర్ధ‌ర‌ణ‌కు వ‌చ్చి అప్రూవ‌ల్ ఇస్తేనే అది గూగుల్ ప్లే స్టోర్‌లోకి వ‌స్తుంది.

అయితే ఈ 8 యాప్‌లు రివ్యూ స‌మ‌యంలో క్లీన్ వ‌ర్ష‌న్‌ను గూగుల్ ప్లే స్టోర్‌కు స‌మ‌ర్పించి, అప్రూవ‌ల్ త‌ర్వాత అప్‌డేట్స్ ద్వారా మాల్‌వేర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ ప‌రిశోధ‌న‌లో తేలింది.

వెంట‌నే ఈ 8 యాప్‌ల‌ను అన్ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని సూచించింది.

మాల్‌వేర్ ఉన్న 8 యాప్‌లు ఇవే..

  • com.studio.keypaper2021
  • com.pip.editor.camera
  • org.my.favourites.up.keypaper
  • com.super,color.hairdryer
  • com.celab3.app.photo.editor
  • com.hit.camera.pip
  • com.daynight.keyboard.wallpaper
  • com.super.star.ringtones

Recent

- Advertisment -spot_img