Homeహైదరాబాద్latest Newsయూనిటీ ఆఫ్ ఉమ్మా ఆధ్వర్యంలో తాగునీటి పంపిణీ

యూనిటీ ఆఫ్ ఉమ్మా ఆధ్వర్యంలో తాగునీటి పంపిణీ

ఇదే నిజం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ పరిధిలో గత ఐదు రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచినీటి వాటర్ క్యాన్లను కొనుగోలు చేయలేని పరిస్థితిలో నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన ముస్లిం యువత యూనిటీ ఆఫ్ ఉమ్మా ముందుకు వచ్చారు. వాటర్ ప్లాంట్ నుంచి నీటి క్యాన్లను కొనుగోలు చేసి వారే స్వయంగా ఇంటింటికి తీసుకువెళ్లి వాటర్ క్యాన్లను ఉచితంగా సరఫరా చేశారు. సుమారు 100 కుటుంబాలకు తాగునీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముజ్జు బాయ్, నసీర్ బాబా, సుభాని, నజీర్, షరీఫ్, ముబీన్ , అయూబ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img