ఇదేనిజం, కొమురం భీం ఆసిఫాబాద్: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం కలవరం రేపుతోంది. అంకుసాపూర్ వాంకిడీ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొన్నటి వరకు కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో చింతలమనపల్లి లో ఏనుగు బీభత్సం సృష్టించి ఇద్దరు ప్రాణాలను తీసింది. ఇప్పుడు మళ్ళీ పులి సంచారంతో.. అటు ప్రజలు ఇటు అధికారులు హడలెత్తిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి సంచారం నేపథ్యంలో అంకుశపూర్ వాంకిడీ వైపు వెళ్లే దారులన్నిటినీ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలను నిషేధించారు. ఎండాకాలం లో ఎక్కువగా రహదారి వైపు పులులు లేదా ఇతర అటవీ జంతువులు వచ్చే అవకాశం ఉందని గ్రామప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.