Homeఅంతర్జాతీయంDivorce : నచ్చని పాటకు డ్యాన్స్ చేసింద‌ని పెళ్లిరోజే విడాకులిచ్చిన వరుడు

Divorce : నచ్చని పాటకు డ్యాన్స్ చేసింద‌ని పెళ్లిరోజే విడాకులిచ్చిన వరుడు

Divorce : నచ్చని పాటకు డ్యాన్స్ చేసింద‌ని పెళ్లిరోజే విడాకులిచ్చిన వరుడు

Divorce : సంగీత్‌లో తమ మనోభావాలు దెబ్బతినేలా నచ్చని పాటకు వధువు డ్యాన్స్ చేయడం విడాకులకు కారణమయ్యింది.

ఈ ఘటన ఇరాక్‌లోని బాగ్దాద్‌లో చోటుచేసుకుంది.

ప్రస్తుతం వివాహ వేడుకల్లో సంగీత్ పేరుతో వధూవరులు డ్యాన్స్‌లు చేయడం సర్వసాధారణమైపోయింది.

అన్ని చోట్లా ఈ ట్రెండ్ కొనసాగుతోంది.

డీజే పాటలకు వధూవరులతోపాటు బంధువులు, అతిథులు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తారు.

మనిషిని కాపాడిన అడవి ఏనుగు పిల్ల

Apply Voter id card : ఫ్రీగా అప్లై.. నెల రోజుల్లో ఇంటికే ఓటర్​ కార్డు..

దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా, స్నేహితులకు షేర్ చేస్తుంటారు.

అయితే, దీనికి భిన్నంగా భార్య డ్యాన్స్‌ చేసిందని పెళ్లిలోనే వరుడు విడాకులిచ్చిన ఘటన ఇరాక్‌లో చోటుచేసుకుంది.

బాగ్దాద్‌కు చెందిన ఓ యువకుడు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.

వివాహ సంగీత్‌లో భాగంగా నవ వధువు ఓ ‘మైసయతారా’ అనే సిరియా పాటకు డ్యాన్స్‌ చేసింది.

(నీపై నేను అధిపత్యం చెలాయిస్తా..వీధుల్లో వేరే అమ్మాయిలను చూస్తే పిచ్చివాడ్ని చేస్తాను..

నేను చెప్పినంటే నువ్వు నడుచుకోవాలి.. నేను అహంకారిని) అని అర్థం వచ్చే కావడంతో ఇది వరుడు, అతడి కుటుంబసభ్యులకు నచ్చలేదు.

లండన్ కు బస్ జర్నీ.. టికెట్ రేటెంతో తెలుసా

Aadhar PVC Card : పీవీసీ ఆధార్​ కార్డు కావాలా.. ఇలా అప్లై చేసుకోండి..

దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు.

తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు.

ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

చివరకు ఆవేశంతో ఊగిపోయిన వరుడు వివాహ వేదికపైనే భార్యకు విడాకులిచ్చాడు.

పెళ్లయిన కొద్ది సేపటికే విడాకులివ్వడంతో అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.

ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన విడాకుల కేసుని స్థానిక మీడియా పేర్కొంది.

అయితే, పాటల కారణంగా పెళ్లిళ్లు ఆగిపోవడం, విడాకులు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు.

గతేడాది జోర్డాన్‌లో ఇలాంటి సంఘటన వెలుగుచూసింది.

సంగీత్‌ వేడుకల్లో ఇదే పాటను ప్లే చేయడంతో ఓ వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చాడు.

లెబనాన్‌లో కూడా ఓ వరుడు పాట కారణంగా భార్య నుంచి విడిపోయాడు.

భారత్‌లోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

భార్య స్నానం చేయడం లేదంటూ యూపీకి చెందిన ఓ వ్యక్తి విడాకుల కోసం కోర్టుకెక్కారు.

181 ఏండ్లుగా పెట్టెలో భద్రంగా గుండె

Abdul Kalam – Vajpayee : కలాం మంత్రి పదవిని ఎందుకు అంగీకరించలేదో తెలుసా..

Recent

- Advertisment -spot_img