Do not cook these foods in Pressure Cooker : ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు… అయినా వండేస్తున్నాం
వంటింట్లో స్టవ్ పాటూ కచ్చితంగా ఉండే వస్తువు ప్రెషర్ కుక్కర్( Pressure Cooker ). పదార్థాలను త్వరగా, సులువుగా ఉడికించాలన్నా మొదట గుర్తొచ్చేది ప్రెషర్ కుక్కర్ మాత్రమే.
చాలా మంది అన్నం, కూరలు కుక్కర్లో( Pressure Cooker ) వండేందుకే ఇష్టపడతారు.
కానీ కొన్ని వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు. వండడం వల్ల ఆ ఆహారపదార్థాలు విషపూరితంగా మారి శరీరంపై దుష్ప్రభావం పడుతుంది.
ఈ ప్రభావం ఒకేసారి కనిపించదు… స్లో పాయిజన్‌లా మెల్లగా శరీరంపై చూపిస్తుంది.
1. అన్నం
ప్రెషర్ కుక్కర్లో అధికంగా వండే పదార్థాలలో అన్నం కూడా ఒకటి. నిజానికి ఇది చాలా హానికరం.
ప్రెషర్ కుక్కర్లో అన్నం వండడం వల్ల అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది.
ఇది వెంటనే ప్రభావం చూపకపోయినా దీర్ఘకాలం కొనసాగితే మాత్రం ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది.
అలాగే ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
2. బంగాళాదుంపలు
మనలో చాలామందికి ఉన్న అలవాటు బంగాళాదుంపలను ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టడం.
ఎందుకంటే ఇది సులభమైన పని కాబట్టి. అయితే బంగాళాదుంపలలో స్టార్చ్ ఉంటుంది.
పిండిపదార్థాలు అధికంగా ఉండే వాటిని కుక్కర్లో వండకూడదు.
దీర్ఘకాలంగా ఇలా కుక్కర్లో ఉడకబెట్టిన బంగాళాదుంపలను తినడం వల్ల క్యాన్సర్, న్యూరోలాజికల్ డిజార్డర్ వంటి అనే ఆరోగ్య వ్యాధులకు దారితీస్తుంది.
3. పాస్తా
పాస్తాలో కూడా పిండి పదార్థం అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని కూడా కుక్కర్లో వండకూడదు.
దీన్ని కళాయిలోనే వండుకోవాలి. పాస్తాను కుక్కర్లో ఉడికించే అలవాటు మానుకోవాలి.
లాభాలు కూడా ఉన్నాయి…
పిండి పదార్థం అధికంగా ఉన్న పదార్థాలనే ప్రెషర్ కుక్కర్లో వండకూడదు. అవి విషపూరితంగా మారుతాయి.
కానీ మిగతా ఆహారపదార్థాలను కుక్కర్లో వండుకోవచ్చు. దీనివల్ల ఆహారంలోని లెక్టిన్ రసాయనం స్థాయి తగ్గుతుంది.
లెక్టిన్ అనేది హానికరమైన రసాయనం. ఇది ఆహారంలోని ఖనిజాలను గ్రహించి, పోషక విలువలను తగ్గిస్తుంది.