సిమ్ కార్డులకు సంబంధించిన కొత్త రూల్స్ జూన్ 26, 2024 నుంచే అమలులోకి వచ్చాయి.
- అప్పటి నుంచి సీమ్ కార్డులపై పరిమితులు అమలులోకి వచ్చాయి.
- మీ పేరుపై 9 సిమ్ కార్డులు (ప్రత్యేక ప్రాంతాల్లో 6) కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే మీరు భారీగా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది.
- లిమిట్కు మించి సిమ్ కార్డులు తీసుకున్నట్లు మొదటి సారి తేలితే రూ. 50 వేల వరకు ఫైన్ పడుతుంది.
- అయితే, అదే తప్పును మళ్లీ చేసినట్లయితే అప్పుడు రూ.2 లక్షల వరకు పెనాల్టీ పెరుగుతుంది. కొన్నిసార్లు జైలుకు సైతం వెళ్లాల్సి వస్తుంది.
- సాధారణంగా అయితే లిమిట్ దాటితే ఫైన్ విధించాలని ఎలాంటి నిబంధనలు లేవని నిపుణులు చెబుతున్నారు.
- కానీ, మోసాలు, చీటింగ్ చేసేందుకు సిమ్ కార్డులను తీసుకున్నట్లు తేలితే మాత్రం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడడంతో పాటు రూ. 50 లక్షల వరకు ఫైన్ పడుతుందంటున్నారు.