Homeహైదరాబాద్latest Newsరామ్‌చరణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

రామ్‌చరణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

‘RRR’ తర్వాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆస్కార్ అవార్డును అందుకొని భారతదేశానికి గొప్ప పేరును తీసుకొచ్చారు. అప్పటి నుంచి రామ్‌చరణ్ గ్రాఫ్ మారిపోయింది. ఇటీవలే చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను కూడా ప్రదానం చేసింది చెన్నైలోని ఓ యూనివర్సిటీ.

తాను ప్రస్తుతం నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ దాదాపు మూడేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఏడాది అక్టోబరులో రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో నటిస్తున్నందుకు రామ్‌చరణ్ తీసుకుంటోన్న పారితోషికం దాదాపు రూ. 90 కోట్లు ఉంటుందట. ఇది విన్న కొందరు నోరెళ్లబెడుతున్నారు.

కాగా చరణ్ తన నెక్స్ట్ మూవీని RC16 టైటిల్‌తో ‘ఉప్పెన ఫేమ్’ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం చరణ్ తీసుకోబోతున్న పారితోషికం రూ. 125 కోట్లు అని టాక్ నడుస్తోంది.

Recent

- Advertisment -spot_img