Homeహైదరాబాద్latest Newsమెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన అక్కినేని నాగార్జున.. ఎందుకోసమో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన అక్కినేని నాగార్జున.. ఎందుకోసమో తెలుసా..?

ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. త్వరలో జరగనున్న ఏయన్నార్ అవార్డ్స్ కార్యక్రమానికి చిరంజీవిని ప్రత్యేకంగా నాగార్జున ఆహ్వానించారు. ఈ ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకమైనది. నాన్న గారి శత జయంతి వేడుకలకు చిరంజీవి, అమితాబ్ బచ్చన్ వస్తున్నారు. దీంతో ఈ వేడుక మరింత ప్రత్యేకం కానుంది. ఈ శతాబ్ది ఉత్సవాన్ని మరిచిపోలేనిదిగా చేద్దాం’ అని పేర్కొన్నారు.చిరంజీవికి 2024 సంవత్సరానికి గాను ఏయన్నార్ జాతీయ అవార్డును అందజేస్తామని నాగార్జున గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ అవార్డును అక్టోబర్ 28న ప్రదానం చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img