దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది. కరోనా కట్టడిలో ముఖానికి మాస్కు ధారణ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ముఖానికి రెండు మాస్కులను ధరించడం ద్వారా మహమ్మారి వ్యాప్తిని రెండురెట్లు మెరుగ్గా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ‘డబుల్ మాస్కుల ధారణ’ విషయంలో పాటించాల్సిన నియమాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.
రెండు మాస్క్‌లు ఎలా ధరించాలంటే..
- డబుల్ మాస్కు ధారణలో భాగంగా ఒకటి సర్జికల్ మాస్క్, మరొకటి రెండు లేదా మూడు పొరలతో తయారైన మాస్క్‌ను ధరించాలి.
- ముక్కు మీద బిగుతుగా ఉండేలా మాస్క్ ధరించాలి.
- శ్వాస క్రియకు ఆటంకం కలిగించేలా మాస్క్ ఉండకూడదు.
- వస్త్రంతో కూడిన మాస్క్‌ను తరుచూ ఉతుకుతూ ఉండాలి.
- డబుల్ మాస్క్ విషయంలో ఇవి వద్దు..
- ఒకే రకమైన రెండు మాస్క్‌లను డబుల్ మాస్క్‌గా ధరించవద్దు.
- ఒకే మాస్క్‌ను వరుసగా 2రోజులు వాడొద్దు.
డబుల్ మాస్క్ సామర్థ్యం ఏమిటంటే?
నాసికా రంద్రాల్లోకి వెళ్లే సార్స్-కోవ్-2 వైరస్‌ను సాధారణ మాస్క్‌తో పోలిస్తే డబుల్ మాస్క్ రెండు రెట్లు సమర్థంగా అడ్డుకుంటుందని ఓ అధ్యయనం తెలిపింది. సరైన మాస్కు ధారణ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. ఈ వివరాలు ‘జామా’ ఇంటర్నల్ మెడిసన్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.