ఇదేనిజం,కంగ్టి :సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం జంగి(బి) గ్రామ శివారులో వ్యవసాయ పొలంలో పలు చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయని సోమవారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంగ్టి మండల విద్యత్ శాఖ ఏఈ కి నాలుగు నెలలు నుండి వ్యవసాయ పొలంలో స్తంభాలు నెలకొరిగాయని వాటిని మరమ్మతులు చేయాలనీ చేపిన పట్టిచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు నేలకొరిగిన స్తంభాలను సరి చేయలేదని రైతులు దత్తురావు,సందీప్ రావు, గొల్ల అశోక్,తదిత రైతులు వ్యక్తం చేశారు. నేలకొరిగిన స్తంభాల వలన ప్రమాదం పొంచి ఉన్న వాటిని సరిచేయడంలేదని అన్నారు.దాని వలన వ్యవసాయ పొలంలో పనిచేయాలంటేనే రైతులు భయాందోళనకు గురవుతున్నారు..చిన్న వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. అధికారులు స్పందించి ఆ రైతుల పొలంలో నేలకొరిగిన స్తంభాలను సరిచేయాలని జంగి గ్రామ ప్రజలు కోరుతున్నారు.