Homeలైఫ్‌స్టైల్‌#Water #Diet : నీళ్లు తాగితే బరువు తగ్గిపోతారా..

#Water #Diet : నీళ్లు తాగితే బరువు తగ్గిపోతారా..

రువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే నీరు తాగండి.

అదేంటీ? నీళ్లు తాగితే బరువు తగ్గిపోతారా అనేగా మీ సందేహం? అయితే, తప్పకుండా నీరు చేసే అద్భుతాలు గురించి తెలుసుకోవల్సిందే.

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషన్ పేర్కొన్న వివరాల ప్రకారం…

  • నీరు శరీరంలోని అన్ని అవయవాలకు మేలు చేస్తోంది.
  • నీరు శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది.
  • శరీరంలో అదనపు బరువును తగ్గించుకోవడానికి వాటర్ డైట్ చేయడం చాలా మంచిది.
  • వ్యాయామం చేసి క్యాలరీలను తగ్గించుకోవడం కష్టమనిపిస్తే.. వాటర్ డైట్ ట్రై చేయండి.
  • రోజుకు 3 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగేవారిలో శరీరం మెటబాలిజం రేటు పెరుగుతుందట.
  • నీరు ఎక్కువగా తాగితే.. శరీరంలో చేరే వ్యర్థాలు మొత్తం సులభంగా బయటకు పోతాయి.

ఏ విధంగా ‘వాటర్ డైట్’ పాటించాలి? 

రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగండి. భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగండి.

ఇలా చేయడం వల్ల కడుపు నిండుగా ఉండి ఆహారం ఎక్కువ తినలేరు. దీనివల్ల బరువు తగ్గుతారు.

రోజూ కేవలం నీటిని మాత్రమే తాగాలంటే కాస్త బోర్‌గా అనిపించవచ్చు. కాబట్టి.. నిమ్మ, పుదీనా, దోసకాయ ముక్కలు కలిపిన నీరు తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.

వాటర్ డైట్.. ప్రయోజనాలేమిటీ?

  • ఇలా నీళ్లు తాగాడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఆకలిని అరికడుతుంది.
  • ఆకలిగా ఉన్నప్పుడు హైక్యాలరీ ఫుడ్ తీసుకోవాడం కంటే, నీరు తాగడం వల్ల క్యాలరీలు కరిగించుకోవచ్చు. దీని వల్ల ఆకలి తగ్గుతుంది.
  • వ్యాయామం చేసే ముందు, తర్వాత నీళ్లు తాగాలి. ముందు నీళ్లు తాగడం వల్ల ఎనర్జీ వస్తుంది.
  • తర్వాత తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ దొరుకుతుంది.
  • త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం.
  • బరువు తగ్గడానికి గోరువెచ్చని నీరు చాలా సహాయపడుతుంది.
  • ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే, త్వరగా బరువు తగ్గుతారు.
  • అందులో నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకుంటే చాలా మంచిది.
  • రోజంతా శరీరానికి సరిపడ నీరు తీసుకోవాలి.
  • ఎంత ఎక్కువగా నీరు తీసుకుంటే అంతే ఎక్కువగా శరీరం తేమగా, శక్తివంతంగా ఉంటుంది.

    ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. పలు అధ్యయనాల్లో తేలిన అంశాలను మీకు తెలియజేయడానికే ఈ కథనం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. మరింత సమాచారం తెలుసుకోవాలంటే తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించాలని మనవి.

Recent

- Advertisment -spot_img