దేశీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్సూరెన్స్ పాలసీల డిజిటలైజేషన్ తప్పనిసరి చేసినట్లు తెలిపింది.
జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధన వర్తిస్తుందని, ఏప్రిల్ 1 నుంచి ఈ-బీమా అమలులోకి రానుందని పేర్కొంది. ఈ-ఇన్సూరెన్స్‌తో పాలసీల నిర్వహణ మరింత సౌకర్యవంతంగా మారుతుందని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది.