HomeతెలంగాణEatala Rajender : 2023లో ప్రజలు తెరాసను పాతరేస్తారు..

Eatala Rajender : 2023లో ప్రజలు తెరాసను పాతరేస్తారు..

Eatala Rajender serious comments on trs party and kcr : 2023లో ప్రజలు తెరాసను పాతరేస్తారు..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఈటల రాజేందర్‌(Eatala Rajender)ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, జితేందర్‌రెడ్డి, వివేక్‌, భాజపా శ్రేణులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా ఈటల రాజేందర్‌ పనిచేశారని అభినందించారు.

”అబద్దాలు చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. కేసీఆర్‌ మాటలను హుజూరాబాద్‌ ప్రజలు నమ్మలేదు.

ఈటల రాజేందర్‌ సతీమణి జమున విస్తృతంగా ప్రచారం చేశారు.

హుజూరాబాద్‌ ఆడబిడ్డలకు పేరు పేరున నమస్కరిస్తున్నా.

హుజూరాబాద్‌ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుంది.

ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకే దళితబంధు పథకం తెచ్చారు.

తెరాస కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేధావులు పనిచేశారు.

హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి” అని కిషన్‌రెడ్డి అన్నారు.

2023లో భాజపాదే అధికారం: ఈటల (Eatala Rajender)

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..”కేసీఆర్‌ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఇక్కడి ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు పనిచేశారు.

అధికార యంత్రాంగం అంతా సీఎం కేసీఆర్‌ ఒత్తిడికి లొంగి పనిచేసింది.

సీఐలు, ఎస్సైలు స్థానిక నాయకులను బెదిరించారు.

డీజీపీ గారూ.. పోలీసులు బెదిరించిన ఆడియోలు నా దగ్గర ఉన్నాయి.

తెరాస కండువా కప్పుకుంటే పనులవుతాయని పోలీసులు బెదిరించారు.

ఒక్క ఉప ఎన్నికలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు.. ఎక్కడి నుంచి వచ్చాయి.

కేసీఆర్‌ నాయకత్వంలో అరిష్టమైన పాలన సాగుతోంది. 2023లో ప్రజలు తెరాసను పాతరేసి భాజపాను గెలిపిస్తారు” అని ఈటల రాజేందర్‌ అన్నారు.

శంకర్‌ పల్లి నుంచి పార్టీ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ

హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

శంకర్‌పల్లి నుంచి భారీ వాహనాలతో ర్యాలీగా హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్నారు.

గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఈటలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు నివాళులర్పించారు.

అనంతరం అక్కడి నుంచి నాంపల్లిలోని భాజపా కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు.

హుజూరాబాద్‌ విజయం తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఈటలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Recent

- Advertisment -spot_img