Homeలైఫ్‌స్టైల్‌Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!

Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!

Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!

Edible oil adulteration: మీ ఇంట్లో మీరు ఏ రకం వంటనూనె వాడుతున్నారు?

విటమిన్​ ఏ, విటమిన్​ డీ అంటూ ప్రకటనలతో హోరెత్తిస్తున్న వంటనూనెల కంపెనీల మాటల్లో నిజమెంత?

వేరుశనగ నూనెలో నిజంగా వేరుశనగలనే వినియోగిస్తున్నారా? ఇంకా వేరేమైనా కలుపుతున్నారా?

ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే.. దేశవ్యాప్తంగా మార్కెట్లో దొరికే నూనెల్లో కల్తీ భారీ స్థాయిలో జరుగుతోందట.

ఈ విషయాన్ని భారత సురక్షిత ఆహార, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)తెలిపింది.

దేశవ్యాప్తంగా దొరికే వంటనూనెలపై ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఓ సర్వే నిర్వహించగా అందులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

Scrub Typhus : హైదరాబాదీలో భ‌య‌పెడుతున్న‌ కొత్త వ్యాధి..

Healthy snacks : టిఫిన్​, వీటిలో అల్లం వాడితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అద్బుతం

Fssai survey on oil:

మార్కెట్లో లభ్యమవుతున్న నూనెలకు సంబంధించి, భద్రత, నాణ్యత, మిస్​బ్రాండింగ్​ విషయాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఈ సర్వే చేసింది.

గతేడాది ఆగస్టు 25-27 మధ్య నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది.

విడిగా దొరికే నూనెలతో పాటు బ్రాండెడ్​ కంపెనీలకు చెందిన వంటనూనెల నమూనాలు సహా మొత్తం 4,461 నూనె నమూనాలను ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ పరీక్షించింది.

అందులో 2.42శాతం నమూనాలు.. భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని(Edible oil adulteration) తేలింది.

వాటిలో హానికరకమైన అల్ఫోటాక్సిన్లు, ఎరువుల అవశేషాలు, భార లోహాలు వంటివి అధిక స్థాయిలో ఉన్నాయి.

మరో 24.2శాతం(1,080) నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది.

Joint Pains : జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు ఈ మూలికలతో చెక్

Zinda Tilismath : హైదరాబాదుకు చెందిన జిందా తిలిస్మాత్ చరిత్ర, ఎలా చేస్తారు?

అందులో హైడ్రోసియానిక్ యాసిడ్ అవశేషాలు కనిపించాయని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ తెలిపింది.

బుటైరో రిఫ్రాక్టో మీటర్​ నిర్దేశించిన పరిమితులను అందుకోలేకపోయాయని చెప్పింది.

ఒకరకం నూనెలో ఇతర నూనెలు కలుపుతున్నారని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ చెప్పింది. షెల్ఫ్​ లైఫ్​ స్టాండర్డ్ ప్రమాణాలు పాటించడం లేదని చెప్పింది.

12.8శాతం(572) నమూనాల్లో.. లేబుల్ మిస్ బ్రాండింగ్​ చేస్తున్నారని తేలింది. అంటే… తమ నూనెలో విటమిన్​ ఏ, విటమిన్ డీ ఉన్నాయని చెప్పినప్పటికీ అందులో అలాంటి విటమిన్లు ఏం లేకుండా ఉండటం అని అర్థం.

Oil survey results: నూనెల నమూనాలను 15 ప్రత్యేక రకాలుగా వర్గీకరించి ఈ పరీక్షలు నిర్వహించారు.

వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఉన్న 580 జిల్లాల నుంచి సేకరించారు.

వీటిని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ల్యాబ్​లకు తరలించి అక్కడ పరీక్షలు జరిపారు.

వంటనూనెల్లో కల్తీ(Edible oil adulteration) జరుగుతోందని సర్వే ఫలితాల్లో తేలిన నేపథ్యంలో.. కల్తీ నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఆదేశించింది.

వంట నూనెల్లో కల్తీ కాకుండా జాగ్రత్త వహించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్​లను కోరింది.

Cancer To Hamsa Nandini: వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా

Micro plastics in Drinking Water : మీరు తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్..

Recent

- Advertisment -spot_img