చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 23 ఏళ్లకే స్టార్ హోటల్లో పట్టుబడింది ఆ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు శ్వేతా బసు ప్రసాద్. 2002లో బాలీవుడ్లో బాలనటిగా ఎంట్రీచిన శ్వేతా బసు ప్రసాద్ తెలుగులో ఆమె హీరోయినిగా నటించిన ‘కొత్త బంగారులోకం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మారింది. ఈ సినిమాలో తన యాక్టింగ్, క్యూట్ నెస్ తో కుర్రాళ్లకి డ్రీమ్ హీరోయినిగా మారింది. అయితే ఆ సినిమా తరువాత అందరూ స్టార్ హీరోయిన్ అవుతుదిని అనుకున్నారు. కానీ ఆమె జీవితం అంత ఒక్కసారిగా మొత్తం తలకిందులైపోయింది. శ్వేతా బసు ప్రసాద్ 2014లో ఓ స్టార్ హోటల్లో అనుకోకుండా పట్టుబడడం.. వ్యభిచార ఆరోపణలపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కానీ ఆ తరువాత శ్వేతాబసు ఆ అరెస్ట్‌పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.
ఓ కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన ఆమెపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తర్వాత కొన్ని నెలల తర్వాత పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు.. అయితే ఈ ఘటన ఆమె కెరీర్‌ను బాగా ప్రభావితం చేసింది. అప్పటినుంచి ఆమెకు సినిమాలు అవకాశాలు రాలేదు. దీంతో 2018లో తను ప్రేమించిన వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. కేవలం 9 నెలల్లో అతనికి విడాకులు ఇచ్చింది. 17 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చిన ఆమె 23 ఏళ్లకే ఓ కేసులో ఇరుక్కుని విడాకులు తీసుకుంది.