పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్థాన్‌కు పారిపోయినా వదలం. అక్కడికి వెళ్లి మరీ మట్టుపెడతాం. తాము పొరుగుదేశాలతో ఎల్లప్పుడూ స్నేహమే కోరుకుంటాం’ అని స్పష్టం చేశారు.