ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం ఏది అంటే చాలా మంది అమెరికా అంటారు. కానీ ఆ దేశం కన్నా ధనిక దేశాలు చాలానే ఉన్నాయి. యూరప్‌లోని లక్సెంబర్గ్ ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ. ఇక్కడ ప్రతి ఒక్కరూ సగటున కోటి రూపాయలు సంపాదిస్తారంటే నమ్మడం లేదా? సాధారణంగా ఒక దేశం ఆర్థిక విజయాన్ని తలసరి జీడీపీ ఆధారంగా అంచనా వేస్తారు. ఇది వ్యక్తిగత ఆర్థిక శ్రేయస్సును చూపుతుంది. కానీ ఈ ప్రమాణం ద్వారా దేశాలను పోల్చడానికి వీలుండదు. 2022 సంవత్సరంలో తలసరి జీడీపీతోపాటు, ప్రజల కొనుగోలు శక్తి, ఉత్పాదకత ప్రమాణాల ఆధారంగా ‘ది ఎకనామిస్ట్ అండ్ సోల్‌స్టాడ్, సోండ్రే’ నుంచి వచ్చిన డేటా ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలేవో ఇప్పుడు చూద్దాం.. తలసరి జీడీపీ ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో యూరప్ దేశమైన లక్సెంబర్గ్ టాప్‌లో ఉంది. 2022లో ఈ దేశం తలసరి జీడీపీ, ఒక లక్ష ఇరవై వేల డాలర్లు అంటే భారత్ కరెన్సీలో సుమారు కోటి రూపాయలు. దీని ప్రకారం ఇక్కడ సగటున ప్రతి ఒక్కరూ కోటి రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట.