తెలంగాణలో కుల గణన ప్రక్రియ రేవంత్ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. తెలంగాణలో జరిగే ఈ సర్వే నేపథ్యంలో ఇప్పుడు పలువురు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను గుర్తుకు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో అన్ని వివరాలు సేకరించారు. ఇక తాజాగా తెలంగాణలో చేపట్టనున్న ఈ సర్వే విషయంలోనూ ప్రభుత్వం ఏం చేయనుందనే ఆసక్తి నెలకొంది. దీంతో రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే వెళ్తున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు.