Ex JD Laxminarayana : రాజకీయ నేతల్లో 80 శాతం అవినీతిపరులే..
Ex JD Laxminarayana : దేశంలో అవినీతిపరులకు తక్షణమే శిక్ష పడితే ఇతరుల్లో భయం పడుతుందన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
అప్పుడేఉ అవినీతి చేయడానికి వెనుకాడతారన్నారు.
ప్రభుత్వ విభాగాల్లో సాంకేతికతను ఉపయోగిస్తే అవినీతిని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఎవరైనా అధికారులు తాము నిర్వర్తించాల్సిన విధులకు రేటు కడితే.. ప్రజలు ఉపేక్షించొద్దని ఆయన సూచించారు.
Diabetes : డయాబెటిస్‌ను ఈ సింపుల్ డైట్‌తో కట్టడి చేయండి
Pure Honey : స్వచ్ఛమైన తేనెను గుర్తించడం ఎలా.. ?
ప్రభుత్వ విభాగాల్లోనే అవినీతి
అవినీతిలో భారతదేశం 86 స్థానంలో ఉందన్నారు లక్ష్మీనారాయణ .
ఇది గత ఏడాది కంటే ఈ ఏడాది ఆరు శాతం పెరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వేను మాజీ జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లోనే ఈ అవినీతి కనిపిస్తోందన్నారు.
సాంకేతికతో అవినీతికి అడ్డుకట్ట
ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించి ప్రజల పనులు జరిపించినప్పుడే అవినీతిని అంతం అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇన్ కంట్యాక్స్ విభాగాన్ని ఎలాగైతే అన్ లైన్ చేశారో అలాగే ప్రతి విభాగంలో టెక్నాలజీ ఉపయోగిస్తే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుతుందని పేర్కొన్నారు.
Sugar : చెక్కర తింటే చర్మంపై ప్రభావం ఉంటుందా..
Pressure Cooker : ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు…
అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఎవరైన లంచం అడిగితే సీబీఐ, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.
లంచం ఇవ్వనిదే పనికాదు..
తెలుగు రాష్ట్రాల్లో లంచం ఇవ్వనిదే ఎలాంటి పనులు కావడంలేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన సర్వే నివేదికలో వెల్లడించింది.
ఈ రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో 70 శాతంపైగానే అవినీతి నెలకొందని తేలింది.
అధికారులలో 80 శాతం మంది అవినీతిపరులే ఉన్నారన్న ప్రజల అభిప్రాయాన్ని తన సర్వే రిపోర్టు పేర్కొంది.
Depression, Stress : మానసిక ఒత్తిడితో భాదపడుతున్నారా.. ఇలా చేయండి..
కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు వచ్చే లక్షణాలు
రెవెన్యూ శాఖలో 85 శాతం అవినీతి ఎక్కువ ఉందని వెల్లడించింది.
రాజకీయ నాయకుల్లో 80 శాతం అవినీతిపరులే..
రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో 80 శాతం మంది అవినీతిపరులేనని ప్రజల తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సర్వే పేర్కొంది.
మూడో స్థానంలో పోలీస్ విభాగం అవినీతి 79 శాతం ఉందని తేల్చింది.
అవినీతి నిర్మూలన కోసం పనిచేసే విజిలెన్స్ కమిషన్, యాంటీ కరప్షన్ బ్యూరో వంటి వాటిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన సర్వే వివరాలను వెల్లడించింది.