Red Banana : ఢాకా బనానా తింటే ఉండదు జీవితానికి ఢోకా
Red Banana : సామాన్యుడి ఆపిల్ గా అరటి పండును అభివర్ణిస్తారు..
ఈ రోజు ఒక అరటిపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికీ తెలిసిందే..
అరటిపండు అంటే పసుపు రంగువే మనకి తెలుసు.. కానీ ఎర్రటి అరటిపండు కూడా ఉంది..
ఇది పసుపు అరటీ తో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తుంది.. అవేంటో చూద్దాం..!!
ఎర్రటి అరటి పండ్లు లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
వీటిని తీసుకోవడం వలన ఆకలిని తగ్గిస్తుంది.
ఫలితం గా బరువు తగ్గవచ్చు. అధిక బరువు, ఊబకాయం తో బాధపడుతున్న వారికి సాధారణ అరటి తో పోలిస్తే ఎర్ర అరటి ఎంతో ఉపదాయకం.
ఈ పండులో విటమిన్ సి, బి6 ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
షుగర్ పెషేంట్స్ చక్కెరకు బదులు తేనె వాడొచ్చా..?
ఇవి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
అరటిలో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇవి మూత్రపిండాల్లో రాళ్లను నివరిస్తుంది.
ఈ అరటి తినడం వలన శరీరంలో క్యాల్షియం ను సమతుల్యం చేస్తుంది.
ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఎముకలు బలంగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది.
ఎర్ర అరటి లో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్స్ ఉన్నాయి.
అధిక నిద్ర కూడా పెద్ద సమస్యలు తెస్తుంది
ఇవి రక్తాన్ని శుద్ధి చేసి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.
ఇంకా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడతాయి.
ధూమపానం అలవాటు ఉన్నవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆ వ్యసనాన్ని విడిచిపెట్టడానికి ఇది సహాయపడుతుంది.
ఎర్ర అరటి పండు గుజ్జును కొబ్బరి నూనె లేదా ఆవ నూనెలో కలిపి జుట్టుకి రాసుకుంటే జుట్టు ఊడిపోకుండా, నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.