Homeలైఫ్‌స్టైల్‌Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్​ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు

Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్​ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు

Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్​ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు

Food in Hyderabad : హైదరాబాద్​ అంటే భిర్యానీ మాత్రమే కాకుండా అనేక ఆహారాలకు కూడా చాలా ఫేమస్​.

ప్రపంచ యాత్రికులు మాత్రమే కాకుండా మన దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా హైదరాబాద్​లో ముందుగా దీని గురించే ఎంక్వైరీ చేస్తారు.

తిని తిరాల్సిందే అని కాకున్నా మంచి టేస్ఠ్​ ఉంది అనే పేరున్న వాటిని ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఎందుకంటే ఒకళ్ళకి నచ్చేది ఇంకొకళ్ళకి నచ్చాలని లేదు కాబట్టి.

హైదరాబాద్ అంటే గుర్తువచ్చేది బిర్యానీ కాబట్టి ముందుగా ఫేమస్​ బిర్యానీ సెంటర్ల గురించి తెలుసుకుందాం.

హోటల్ షాదాబ్ మరియు నయాబ్చార్మినార్.

షాగౌస్టోలిచౌకి.

బావార్చి ఆర్ టి సి క్రాస్ రోడ్స్.

మెరిడియన్ పంజాగుట్ట లో మటన్ బిర్యానీ.

కేఫ్ బహార్ బషీరాబాద్ కూడా బాగుంటుంది అని చాల మంది చెప్పారు.

యస్ ఆర్ నగర్ లో మొగల్ పారడైస్ లో ఫిష్ బిర్యానీ.

పిస్తా హౌస్ కె పి హెచ్ పి కాలనీ లో

మాదాపూర్ అభిరుచి లో మిక్సడ్ బిర్యానీ(ఘాటు చాల ఎక్కువగా ఉంటుంది). మీల్స్ కూడా బానే ఉంటాయి.

కె పి హెచ్ పి కాలనీ లో ఆర్ వి స్పైస్ లో రొయ్యల పలావ్ మరియు మటన్ ఫ్రై.

ఆన్లైన్ లో మసాలా రెస్తౌరెంట్​లో చికెన్ బోన్​లెస్​ ఫ్రై దానితో బగారా రైస్

స్నేహితులతో యస్ ఆర్ నగర్ లో మేఘన బిర్యానీ

ఈ మధ్యకాలం లో అందరూ అరేబియన్ ఫుడ్ ఇష్టపడుతున్నారు..

ఈ మండిలలో మండి@36 ‌‌జూబ్లీహిల్స్ లో ఉంటుంది.

ఇక్కడ ఫాహెం చికెన్ మండి ఉంటుంది చుడండి వేడిగా ఆలా తింటుంటే తినేస్తూ ఉంటాము దీనితో పాటు ధంసప్, గ్రిల్ ఫిష్ నంజుకుంటూ తింటే బాగుంటది.

గ్రిల్స్ ఇష్టపడేవాళ్లు ఉంటె సిద్ధిక్ గ్రిల్స్, పాలమూరు గ్రిల్స్లో బాగుంటాయి.

ఇలాంటి గ్రిల్స్ ఎక్కువగా లెక్కలేకుండా తినాలంటే కూడా అబ్సొల్యూట్ బార్బక్యూ బఫెట్లకి వెళ్ళొచ్చు.

ఇక శాఖాహారం విషయానికి వస్తే మీల్స్ తినడానికి ముందుగా మీరు వెళ్ళాల్సింది అమీర్​పేట్​లోని కాకతీయ మెస్​..

అలాగే కూకట్పల్లిలో సుబ్బయ్యగారి హోటల్ బుట్ట భోజనం, యస్ ఆర్ నగర్ లో హర్ష మెష్ ఉండనే ఉంది, పైన చెప్పినట్టే మాదాపూర్ అభిరుచిలో కూడా మీల్స్ బాగుంటాయి.

అల్ఫాహారం అయితే నాంపల్లి రాంకీ బండి దోశల, ఒకవేళ మీకు రక రకాల పచ్చళ్ళతో అల్ఫాహారం లాగించాలంటే చట్నీస్ లో తినవచ్చు కానీ ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి.

రోడ్ మీద 99 దోశలు కూడా బాగుంటాయి.

కె పి హెచ్ పి కాలనీ నుండి ప్రగతి నగర్ వెళ్ళేదారిలో కోనసీమ వంటిల్లు ఉంటుంది.

ఇక్కడ ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి లో ఆదరణ పొందిన అల్ఫాహారాలు ఉంటాయి చాల బాగుంటాయి.

పొట్ట నిండా తినకండి కొంచం గ్యాప్ ఇచ్చి ఒక బొబ్బట్టు ఒక రోజ్ మిల్క్ కూడా తాగేయండి.

డి ఎల్ ఎఫ్ దగ్గర సాయంత్రం వేళా చిరు తిండ్లు తినచ్చు

అర్ధ రాత్రి వేళల్లో ఆకలి వేస్తే మైత్రీవనం వెనకాల వేడి వేడిగా టిఫిన్ చేసి అక్కడనే బాదం మిల్క్

ఇప్పడు మాదాపూర్లో కూడా అర్ధరాత్రి అల్ఫాహారాలు బాగా దొరుకుతున్నాయి, రాత్రి ఆలస్యం అయితే అటు వెళ్లి పొట్ట నింపేయచ్చు.

అంతా చదివేసారు కదా! అలిసిపోయి ఉంటారు ఒక ఇరానీ చాయ్ ఆల్ సభా రెస్టారెంట్ గచ్చిబౌలి లో తాగేసేయండి. (పాత బస్తిలో చాల చోట్ల బాగుంటుంది).

Recent

- Advertisment -spot_img