Homeహైదరాబాద్latest Newsశింబుతో గొడవ..? ప్రభుదేవా కండిషనింగ్..! నయనతార ఏం చెప్పిందంటే ..?

శింబుతో గొడవ..? ప్రభుదేవా కండిషనింగ్..! నయనతార ఏం చెప్పిందంటే ..?

ఇటీవలే నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార ముఖ్యంగా శింబు మరియు ప్రభుదేవాతో తన రిలేషన్ గురించి మాట్లాడింది. శింబుతో తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. శింబు పేరు చెప్పకుండా నయనతార.. ‘నేను రిలేషన్ షిప్ విషయంలో నేనే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను. నేను అతని నుండి అదే ఆశిస్తున్నాను. కానీ నా తొలిప్రేమలో అది జరగలేదు అని చెప్పింది. ఆ కారణంగా అప్పుడు జరిగిన గొడవలతో మేము విడిపోయామని నయనతార తెలిపింది. ఆ తర్వాత నయనతార ప్రభుదేవాతో బ్రేకప్ గురించి మాట్లాడుతూ, సినిమాలో నటించకూడదని నాకు కండిషన్ పెట్టాడు. ‘మధ్యలో సినిమా నుంచి తప్పుకోవడానికి నేను కారణం కాదు. ఆ ఒక్క వ్యక్తి… అది నా నిర్ణయం కూడా కాదు. నేనెప్పుడూ సినిమా ఇండస్ట్రీని వదిలేయాలని అనుకోలేదు. ఆ సమయంలో జీవితాన్ని అర్థం చేసుకునేంత పరిణతి నాకు లేదు. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానను నయనతార చెప్పింది. ఆ వ్యక్తి పేరు చెప్పకుండానే ప్రభుదేవాతో ఎందుకు విడిపోయానని పరోక్షంగా చెప్పింది.

Recent

- Advertisment -spot_img