Homeబిజినెస్‌Financial Security : హైదరాబాద్ లో ఆర్థిక భద్రత తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే

Financial Security : హైదరాబాద్ లో ఆర్థిక భద్రత తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే

Financial Security : హైదరాబాద్ లో ఆర్థిక భద్రత తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే

Financial Security : మెట్రో నగరాల్లో ఆర్థిక భద్రత హైదరాబాద్ లో తక్కువగా ఉందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది.

హైదరాబాద్ లో ఆర్థిక భద్రతను సూచించే ‘ప్రొటెక్షన్ క్వొటెంట్’ 48గా ఉంటే.. దేశంలోని మెట్రో నగరాలన్నింటిలోకి సగటు ప్రొటెక్షన్ క్వొటెంట్ 53గా ఉందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో తెలిసింది.

ఢిల్లీ, బెంగళూరు ఆర్థిక రక్షణ విషయంలో ముందున్నాయి. ఇక్కడ ప్రొటెక్షన్ క్వొటెంట్ 56గా నమోదైంది.

ముంబైలో 55, కోల్ కతా, చెన్నై నగరాల్లో 52 నమోదైంది. 2021 డిసెంబర్ నుంచి 2022 జనవరి మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 5,729 మంది అభిప్రాయాలు తెలుసుకుని ఫలితాలను విశ్లేషించారు.

Curd : పెరుగుతో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తింటే అనేక లాభాలు

Pimples : మొటిమ‌లను త‌గ్గించే అద్భుత‌ చిట్కా

‘‘హైదరాబాద్ లో ఆర్థిక భద్రతకు సంబంధించి బలమైన స్పృహ ఉంది.

అయితే చురుకైన ఆర్థిక ప్రణాళిక, జీవిత బీమా పట్ల అవగాహన ఇంకా ఎంతో పెరగాల్సి ఉంది.

హైదరాబాద్ కు సంబంధించి ఈ అంతరాన్ని పూడ్చాల్సి ఉంది.

జీవిత బీమా మీరు ప్రేమించే వారికి ఆర్థిక భరోసానిస్తుందన్న విషయమై మరింత ప్రోత్సహించాల్సి ఉంది’’ అని మ్యాక్స్ లైఫ్ డిప్యూటీ ఎండీ విశ్వానంద్ తెలిపారు.

టర్మ్ ఇన్సూరెన్స్ పట్ల హైదరాబాదీల్లో 79 శాతం మందికి అవగాహన ఉన్నా కానీ, కేవలం 41 శాతమే టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్టు తెలిసింది.

అదే బెంగళూరులో 59 శాతం, ముంబైలో 50 శాతం, చెన్నైలో 48 శాతం, ఢిల్లీలో 47 శాతం మందికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది.

ఇక్కడ జీవిత బీమానే ఆర్థిక రక్షణగా అర్థం చేసుకోవాలి.

Morning Food : ఉద‌యాన్నే వీటిని తింటే రోజంతా ఉత్సాహం

Before Death : మ‌నిషి చ‌నిపోవ‌డానికి ముందు ఏమౌతుంది

Recent

- Advertisment -spot_img