వైసీపీ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ జల్లా పెనుగంచిప్రోలులో ఏడాది బాలుడిని కుక్కలు కరిచి చంపేశాయి. ఈ ఘటనపై అంబటి రాంబాబు స్పందించారు. వైసీపీ పార్టీ కార్యకర్తల్లో.. వాడి మీద కేసు పెడదాం.. వీళ్ళని బొక్కలో వేద్దాం.. మొత్తాన్ని చితక్కోడదాం అనే వాటి మీద నుంచి దృష్టి ఇలాంటి ఘోరాల మీద పెట్టండి అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ బాలుడి వార్త చదువుతుంటేనే హృదయం ద్రవిస్తోంది అని ఆయన ట్వీట్ చేశారు.