బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తో పాటు ఆయన భార్య హేమ, కుమారుడు శిశిర్, మాజీ ఎంపీ సంజయ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వారు ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్లు లేనివారికి రూ.5లక్షలు..
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే బీజేపీలో ఉన్న ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్‌ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఒడిషా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను ఆయనకు అప్పగించే.. ఆ రాష్ట్రంలో పార్టీని విస్తరించి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచించారు.
ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..
అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. సొంత రాష్ట్రంలోనే ఎదురు దెబ్బ తగలడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సోంత రాష్ట్రంలోనే ఓటమి పాలైన బీఆర్ఎస్.. పక్క రాష్ట్రాల్లో ఏం రాణిస్తుందని దృష్టిలో పెట్టుకుని గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: రైతుబంధుపై శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ ఎప్పుడంటే..?