సంగారెడ్డిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోహీర్ లో నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కుప్పకూలడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు వారంతా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.